గౌతమి పుత్ర శాతకర్ణి – Part 2

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000

ఆమె మైకంలో పడి శాతకర్ణి ఆమె గురించే తలచుకుని మురిసిపోయి, కొన్ని రోజులకి ఎలాగైనా ఆమెను పొందాలని చాలా ప్రాంతాలు వెదికాడు. ఆమె దొరకలేదు వైరాగ్యంతో కృంగిపోయాడు. అప్పుడు యువరాజు ఒక కొండ వద్దకు వచ్చి అక్కడ శివాలయంలో తలదాచుకున్నాడు.

అక్కడ శివమహాపురాణం చెబుతున్నారు పండితులవారు. “ఈ అనంతవిశ్వం ఒక నల్లరాయిలా ఏర్పడింది. విశ్వశక్తి అంతా శివుని రూపంలో వచ్చింది. శివుని నుంచి ఆదిశక్తి, బ్రహ్మ వచ్చారు. బ్రహ్మ సప్త ఋషులను సృష్టించారు. బ్రహ్మ సృష్టికర్త అయ్యి సంధ్యను సృష్టించారు. బ్రహ్మ మానసపుత్రుడు మన్మధుడు. మన్మధుని కారణాన కామం పెరిగిపోయింది. ఆ కామం పరమశివుని మీద అస్త్రం ఎక్కుపెట్టినప్పుడు మన్మధుడు బూడిద అయిపోయాడు. అప్పుడు మన్మధుడి ప్రభావం వల్ల బ్రహ్మ కామం తో ఆమెను చూడటం వల్ల తట్టుకోలేక సంధ్య కూడా అగ్నిప్రవేశం చేసి ప్రాతః సంధ్య శ్యామ సంధ్యగా మారిపోయింది. అలా తన తేజస్సుని మార్గశిర మాసంలో అగ్నిగా మార్చి ఈ అరుణాచలం పై వెలిశారు మహాశివుడు “అని చెప్పాడు. అప్పుడు ఆలోచన వచ్చింది, శాతకర్ణికి.

గ్రంథం లో మొదటి వాక్యం, సృష్టిమూలం అగ్గిరవ్వ అయితే అంటే ఈ అరుణాచలంలో ఆ అగ్ని నాకు దొరుకుతుంది.,అని ఈ అరుణాచలానికి ఎలా వెళ్ళాలి అని ఆలోచించాడు. అరుణాచలం కొండ క్రిందకు వచ్చి శాతకర్ణి అంతా వెదికాడు ఏమైనా దారి దొరుకుతుందేమోనని. అంతా దట్టమైన అడవి, యువరాణిని ఇంకా మరిచిపోలేకుండా ఉన్నాడు శాతకర్ణి. అప్పుడు ఒక శివాలయం కనిపించింది. అందులోని పూజారి పేరు దక్షిణామూర్తి, దక్షిణామూర్తికి జరిగిన సంగతి అంతా చెప్పి తనకు దారి చూపించమన్నాడు శాతకర్ణి అప్పుడు పూజారి “నాయనా ఇది శివుడు తన ఆత్మశక్తి జ్వాలగా మార్చి వెలసిన ప్రదేశం. బ్రహ్మ కుమారులు(సనక, సనాతన, సనందన, సనత్ కుమారులు ) నలుగురూ అన్ని శాస్త్రాలను ఔపాసన పట్టినా ఏదో తెలియని తనం వెంటాడుతూ ఉండేది.

అప్పుడు జ్ఞానం సంపాదించుకోవడానికి పరమేశ్వరుని వద్దకు వచ్చి జ్ఞానం ఉపదేశించమని చెప్పారు. శివుల వారు దక్షిణామూర్తిగా మారి ఒక భోధి వృక్షం దగ్గర ఉపదేశం చేశారు. ఆ ఉపదేశం సారాంశం ఏమిటంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలని.నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే తురియ స్థితికి చేరాలి, అది సమాధి స్థితికి ముందు స్థితి.ఆ భోధి వృక్షం ఇక్కడే ఉంది.ఆ స్థితి పొందడానికి నీకు నేను సాయం చేస్తాను “అన్నారు. ఇది కార్తీక మాసం, కార్తీక మాసం 21వ రోజున శివుని శక్తి సంపూర్ణంగా వెలుగు రూపంలో కనపడుతుంది. ఆ శక్తికి మూలం ఎక్కడో ఎవరికీ తెలియదు. నువ్వు తెలుసుకుంటే నీటిలో దీపం వెలిగించే అగ్గి రవ్వ దొరుకుతుంది అని అన్నారు.

తురియ స్థితి పొందడానికి శాతకర్ణి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. 21వ రోజు రానే వచ్చింది. శివునికి వెలుగుకి సంబంధమైనది ఏది అని ఆలోచించి చంద్రవంక శివుని తలపై ఉండడాన్ని చూసి, ఆలోచించాడు. చంద్రుని కిరణాలు కొండపైన ఒక చోట పడుతున్నాయి. వాటిని చూసి ఆ ప్రదేశానికి వెళ్ళాడు. కొండపైన ఒక ద్వారం తెరుచుకుంది. కొండలోనికి ఒక దారి ఉన్నది. నాలుగు ద్వారాలు కొండ సొరంగంలోనికి ఉన్నాయి. వాటిని చూశాడు శాతకర్ణి. మొదటి ద్వారం దగ్గరకు వెళ్ళాలి అంటే నీళ్ళు లోతుగా ఉన్నాయి. ప్రక్కనే బోలెడు అస్థి పంజారాలు ఉన్నాయి ,ఒక పడవ ఉంది ,కర్రతో పడవ నడుపుకుంటూమొదటి ద్వారం వద్దకు వెళ్ళాడు. ద్వారం బయట ,పెద్ద తాళం ఉంది.కానీ ద్వారానికి తాళం కప్పలేదు ద్వారం రాయితో చేయబడింది కాగడా వెలుతురులో చూస్తే ద్వారం ప్రక్కగా రాయితో చేసిన కప్ప ఉంది.రెండు రాళ్ళ తలుపుల మధ్య తాళం కప్ప ఉంది మధ్యలో చేయి వెళ్ళటం లేదు ఆ రెండు గోడల సందులో చెయ్యి ఎంత వంచినా వెళ్లట్లేదు.పడవలో శాతకర్ణి తురియ సాధన చేశారు. ఒక ఆలోచన వచ్చింది.చేతిని మోచేయి వద్ద విరిచాడు అలా చేయడం వల్ల ఎంతో బాధకు లోనయ్యాడు. ఇంకో చేతితో పట్టుకుని, ఆ సందులో చేతిని దూర్చి తాళం తిప్పగలిగాడు.విపరీతమైన బాధతో ఉన్నాడు శాతకర్ణి. వెంటనే తలుపు తెరుచుకుంది ,వెంటనే మెడలో గుడ్డ వదులుగా కట్టి అందులో విరిగిన చేతిని పెట్టాడు. ఒక చేతితోనే పడవ నడిపాడు. రెండో ద్వారం సమీపించేటప్పటికి నీటిలో అలలు బయలు దేరాయి ,ఎదురుగా సుడిగుండం ఉంది.దాని తప్పించుకోబోయి పడవ తిరగబడిపోయింది.ప్రక్కనే ఉన్న తీగను పట్టుకోబోయాడు .అది నీటి సర్పం ,నాలుక మీద కాటు వేసింది నాలుక పెద్దగా వాచిపోయి ఊపిరి ఆడటంలేదు .వెంటనే శాతకర్ణి ,సాధన చేసి కత్తితో గొంతు మీద గాటు పెట్టాడు .గాలి ఆడింది .వెంటనే తూడు పువ్వు రెమ్మను కత్తిరించాడు .అది గొట్టంలా ఉంది. దానిని గొంతులో పెట్టాడు .గాలి ఆడుతూ ఉంది వెంటనే పెద్ద అరటి ఆకు లాంటి ఆకులు నీటిపై తేలియాడుతున్నాయి . ఓపిక తెచ్చుకుని శాతకర్ణి వాటి పై పడుకున్నాడు .

కళ్ళు తెరిచేసరికి ఎదురుగా దక్షిణామూర్తి పూజారి ఉన్నారు. కాంతి మీద పడి వంటిపై ,చేయిపై గాయాలు మానిపోయాయి. అప్పుడు దక్షణామూర్తి,చెబుతూ, “ నాయనా నీకు రెండు పరీక్షలు పెట్టాను. మొదటిది నొప్పి మీద భయం పోగొట్టేది .రెండవది ప్రాణం మీద మమకారం పోగొట్టేది చావు దగ్గరికి వెళ్ళి వచ్చిన వాడు చావు గురుంచి భయపడడు. సాలిగ్రామ నిర్మితమైన అరుణాచల స్వామి ఆలయానికి స్వాగతం.” .ఇంకొక ద్వారం మిగిలింది, ఆ ద్వారం తర్వాత నీకు అరుణాచల స్వామి కటాక్షం కలుగుతుంది “అన్నారు. అక్కడకు వెళుతుంటే అక్కడ యువరాణి కొలనులో స్నానం చేస్తున్నది.పున్నమి వెలుతురు లో ఆమె మేని ధవళకాంతులీనుతుంది..ఇంకా చెలికత్తెలు కూడా స్నానం చేయుచున్నారు. అందరూ వివస్త్రలు గా ఉన్నారు. అంగనల కుచములు నీటి ప్రభావం వల్ల పెద్దగా అనిపించుచున్నవి .వారి కాళ్ళు నున్నగా పాదరసం వలె నీటి లో కదలాడుచున్నవి . యువతులను చూసిన శాతకర్ణి వారి వద్దకు వెళ్ళాడు. వారిని చూసి బయటకు రండి మీ వెనుక మొసలి ఉన్నది అని చెప్పాడు. అప్పుడు ఆ అందమైన యువరాణి తన నగ్న శరీరం తో శాతకర్ణి వద్దకు వచ్చినది.

నీటి తో తడిసిన ఆమె శరీరం బంగారు వర్ణం లో మెరిసి పోతూ ఆమె అందాలు రెట్టింపయ్యాయి . అతని అంగము ను స్పృశించి నవ్వుతూ స్పందన లేకపోవుట గమనించి ,నవ్వి అతని ఇంద్రియ నిగ్రహము నకు కారణం ఇతను తురీయా స్థితి సాధించటం అని చెప్పి వెళ్ళిపోయింది.అప్పుడు వెనుక నుండి దక్షిణామూర్తి భళా శాతకర్ణి ,నీవు ఇంద్రియాలను జయించావు తురియ స్థితిని నీవు సాధించావు ,శుక మహర్షి మాత్రమే ఈ స్థితిని పొందగలిగారు .వ్యాసునికి కూడా దక్కని స్థితి నీకు కలిగింది. అంతలో ద్వారం తెరుచుకుంది. నాలుగు చిరుత పులులు వచ్చి శాతకర్ణి పై పడ్డాయి .ఎదురుగా కత్తి ఉన్నది.కత్తి పట్టుకుని కోపంతో ఉన్న చిరుత పులులు పైకి ఎగిరాడు. శాతకర్ణి ,జంతువులు తన బాల్య మిత్రులు గనుక వాటి మదం అణిచి ఒక చిరుత మీద స్వారీ చేశాడు . అప్పుడు దక్షిణామూర్తి చూసి భళా “ చేతిలో కత్తి ఉన్న వాటిని చంపకుండా జీవకారుణ్యం చూపించావు” అని అన్నారు. అప్పుడు దక్షిణామూర్తి ఆఖరి తలుపు తీసి స్పటిక లింగాన్ని చూపించి .అప్పుడు అడిగాడు, దక్షణామూర్తి, శివలింగం అంటే ఏమిటి అని .

వెలుగులు జిమ్ముతున్నఆ శివలింగం అంతా ప్రకాశంగా ఉంది.అప్పుడు శివలింగాన్ని చూసి ధ్యానం చేసి శాతకర్ణి ఆ శివలింగం మానవుని శుఘమ్న నాడి కి చిహ్నం అని చెప్పాడు. అప్పుడు శాతకర్ణి తీక్షణంగా శివలింగాన్ని గమనించాడు. రెండు కెంపులతో శివలింగానికి రెండు కళ్ళు ఉన్నాయి.శివునికి మూడో కన్ను కూడా ఉంటుంది. అని ఆలోచించుకొని రెండు రెండు కన్నుల మధ్య గంధం రాసి ఉంది,అది తొలగించాడు శాతకర్ణి. శాతకర్ణి అప్పుడు మూడో కన్ను బంగారు రేకుతో చేయబడిన ఆ కన్నును ప్రక్కకు జరిపాడు రేకు తీయగానే ఎంతో ప్రకాశంతో వెలుగుతున్న సోమ వజ్రాన్ని చూసాడు.

ఆ వజ్రాన్ని తీసుకుని ఇదే అరుణాచలంలో వెలుగు అనుకోని ముందుకు వెళ్ళాడు . దక్షిణామూర్తి దగ్గరకు అంతలో ఒక సంఘటన జరిగింది. ఒక త్రిశూలం వచ్చి దక్షిణామూర్తికి తగిలింది .రక్తం ధారగా కారిపోతుంది .అప్పుడు శాతకర్ణి ఆలోచించి నాకు గొంతుకు ,చేతికి ఉన్న గాయాన్ని ఈ కాంతి నయం చేసింది. కానీ దక్షిణామూర్తి చెప్పాడు ,నీవు కారణజన్ముడివి ,కాబోయే చక్రవర్తివి,ఈ వజ్రాన్ని తీసుకు వెళ్ళు ఇంకొన్ని క్షణాల్లో కార్తీకమాసం 22వరోజు వస్తుంది .అప్పుడు ఈ కాంతి వెళ్లిపోతుంది . అప్పుడు శాతకర్ణి ఒక మనిషి ప్రాణం కన్నా ఇదేమి ముఖ్యం కాదని తలచి ఆ కాంతిని దక్షిణామూర్తి గాయంపై ప్రసరింపచేశాడు .సోమ వజ్రం వెలుగు పోయింది వెంటనే దక్షిణామూర్తి గాయం నయం అయ్యింది . దక్షిణామూర్తి మామూలు మనిషి అయ్యాడు . అప్పుడు దక్షిణామూర్తి చెప్పాడు .శివుని యొక్క ఆత్మశక్తి ఈ అరుణాచలాన్ని తేజోమయం చేస్తుంది ,కానీ ఈ స్థలం నిన్ను నువ్వు తెలుసుకొనేలా చేస్తుంది .ఆత్మ సాక్షాత్కారం కలుగ చేసే పుణ్యభూమి .నీవు ఈ స్థితిని సాదించావు. నీకు కావలిసిన వెలుగు నీలోనే ఉండి .నీవే చూడు నీకే కనిపిస్తుంది.అన్నాడు.

వెంటనే శాతకర్ణి శరీరంలోనుంచి వెలుగు(ఆత్మశక్తి ) వజ్రం లోకి వచ్చింది అప్పుడు దక్షిణామూర్తి ని, ధైర్యసాహసాలు అన్నీ నిరూపించుకున్నావు. బుద్ది బలం ,యోగ బలం నిరూపితమైనది.నీవు తక్షణం రిష్య ముఖ పర్వతం వద్దకు వెళ్ళు .అక్కడ మీ ముత్తాత శాలివాహనుడు గురించి నీకు తెలుస్తుంది.

శాతకర్ణి తన గుర్రం మీద ఎక్కి సోమవజ్రాన్ని సంచిలో పెట్టుకుని కిష్కింద రాజ్యానికి బయలుదేరాడు. ఋష్యముఖి పర్వతం కిష్కింధ రాజ్యం వద్ద ఉన్నది. కిష్కింద రాజ్యాన్ని అనిరుద్ధుడు అనే మహారాజు పాలిస్తున్నాడు. వాలి సంతతికి చెందినవాడు. రాజ్యం పర్వతాల నడుమ ఉన్నది. చుట్టూ పర్వతాలు గోడల్లా ఉన్నాయి. రెండు కొండల మధ్య మార్గం ఉన్నది. అది ముఖద్వారం. ఒక్కో కొండపై ఒక వానర వీరుని శిల్పం ఉన్నది. వాళ్ళిద్దరూ మల్లయుద్ధం చేస్తున్నట్టు ఉన్నది. చేతుల రెండూ బాహాబాహీ చేస్తున్నట్టు ఉన్నది, అది ఆ ముఖద్వారానికి తోరణంలా ఉన్నది. ముఖద్వారం వద్ద వానర వీరులు శాతకర్ణిని ఆగి ఆది విచారించారు. తాను శాలివాహన యువరాజు అని శాతకర్ణి చెప్పాడు.

అరుణాచలంలోని తీవ్ర ఒత్తిడి వల్ల బక్కపలుచగా తయారయ్యాడు శాతకర్ణి. వానరవీరుడు నువ్వు యువరాజా? అని గేలి చేసి కయ్యానికి కాలుదువ్వారు. వెంటనే శాతకర్ణి గర్వం అణచాలని చెప్పి వారితో యుద్ధం చేశాడు. కానీ వానర వీరుల బలం ముందు శాతకర్ణి నిలువలేకపోయాడు. వాళ్ళు ముగ్గురూ కలిసి శాతకర్ణిని మట్టికరిపించారు. శాతకర్ణిని బంధించాలని చూశారు, అప్పుడు శాతకర్ణి శివుడిని తలచుకుని సోమవజ్రాన్ని బయటకు తీశాడు. ఆ శక్తికి తాళలేక వానర వీరులు పారిపోయి తమ రాజ్యంలోని సాధువుని తీసుకువచ్చారు. ఇదేదో మంత్రజాలమని తలచి ఆ సాధువు వచ్చి శాతకర్ణిని చూసి, “నాయనా ఇది సోమవజ్రం, శివుని తేజస్సు గలది. ఇది సామాన్యులకు దొరికేది కాదు. నీవు కారణజన్ముడివి నిన్ను మా గురువుగారి వద్దకు తీసుకువెళతాను” అని తీసుకెళ్ళాడు. సొరంగ మార్గంలో నుంచి భూగర్భగుడిలోకి ప్రవేశించారు ఇద్దరూ. ఒళ్ళంతా తెల్లని జుట్టుతో సింహాసనం మీద ఉన్న ఒక యోగిని చూశారు శాతకర్ణి. ఆ గదిలో వానరులు మల్లయుద్ధం, గదాయుద్ధ శిక్షణ పొందుతున్నారు. అప్పుడు శాతకర్ణి నమస్కరించి, “యోగిపుంగవా, ఎవరు మీరు? “అని అడిగాడు. ధ్యానంలో ఉన్న ఆ యోగి, శాతకర్ణి చేతిని చూసి, నాయనా నీవు అచ్చం మీ ముత్తాతలా ఉన్నావు, మీ ముత్తాత కుండలిని కూడా అదే అని అన్నారు.

ఆశ్చర్యంగా చూశాడు శాతకర్ణి “నా పేరు జాంబవంతుడు. నేను ఈ కిష్కింధ రాజ్యానికి రక్షకుడిని “అని అన్నారు ఆ యోగి. అప్పుడు జాంబవంతునికి నమస్కరించి శాతకర్ణి, మిమ్ములను కలుసుకోవడంతో నా జన్మ ధన్యమయినది. “నా ముత్తాత మీకు తెలుసా “అన్నాడు. అప్పుడు జాంబవంతుడు, “పరశురాముడు సృష్టించిన ఈ దక్షిణ జంబూ ద్వీపంలో తరాల కొద్దీ రాజులను, రాజ్యాలను పరిరక్షించడానికి నియమింపబడిన వారిలో నేను ఒకడిని మా అందరికీ అధినాయకుడు ఒకరు ఉన్నారు. త్వరలో నీకు తెలుస్తుంది. మీ ముత్తాత శ్రీముఖ శాలివాహనుడు. బాలకుడిగా వచ్చిన ఆయనకు బాహుబల సంపన్నునిగా మార్చింది మేమే. ఆయన గొప్ప వీరుడు ఒక్క కత్తి వేటుతో 15 మందిని చంపిన ఘనుడు. ” అప్పుడు శాతకర్ణి ఆశ్చర్యంతో అది ఎలా సాధ్యం జాంబవంతుల వారు అని అడిగాడు. మీ ముత్తాత ఆయుధం పేరు ఉరిమి. మూడు కత్తులు ఒక్క పిడితో చేయబడి ఉంటాయి, కత్తులకు వంగే గుణం ఉంది. కత్తిని తాడులా గుండ్రంగా చుట్టి ఒక్క ఉదుటన వదిలేవాడు ,చుట్టూ చక్రంలా తిప్పేవాడు. ఆదృశ్యం ఇప్పటికీ నా ముందు కదలాడుతుంది అని చెప్పాడు.

“నా ముత్తాత గురించి ఇంకా వివరాలు చెప్పండి” అన్నాడు శాతకర్ణి.అప్పుడు జాంబవంతుల వారు, కాలమే నీకు కధగా చెబుతుంది నాయనా అన్నారు. “ నీవు వచ్చిన కార్యమేమి “ అని అడిగాడు. “నేను ఈ తాళపత్ర గ్రంధంలోని రెండో వాక్యం కోసం వచ్చాను, నన్ను దక్షిణామూర్తి గారు ఇక్కడికి అరుణాచలం నుండి పంపారు ” అని అన్నాడు. ఆ తాళపత్రం చూశాడు జాంబవంతుడు, అగ్నితో నీటి దీపం వెలిగించవచ్చు అని చదివారు. “నాయనా ఆ జలాలు ఋష్యముఖి పర్వతం మీద ఉన్నాయి, అక్కడ మాతంగ ముని ఆశ్రమం ఉన్నది, ఆ ఆశ్రమ౦లోని కొలనులో ఆ నీరు దొరుకుతాయి.మామూలు వ్యక్తులకు అక్కడ ప్రవేశం నిషిద్దం. ఆ కొలనుకు యక్షులు కాపలాగా ఉంటారు. నీవు శక్తిహీనుడిలాగా ఉన్నావు. కావున నీవు సరైన శిక్షణ నా వద్ద తీసుకోవలసి ఉంటుంది. సాధువు చెప్పారు. “నిన్ను మల్లయుద్ధంలో వానరులు ఓడించారని”. . నీ కుండలిని బట్టి నీవు ఈ జంబూద్వీపానికి చక్రవర్తిని అవుతావు. అతులిత బలసంపన్నుడివి అవ్వాలి. నేను నీకు శిక్షణ ఇస్తాను. మొదట నీవు అంజనాద్రి పై ఉన్న మూలికలు తీసుకురావాలి, ఈ సాధువు నీతో పాటు వస్తారు. ఆ మూలికలు స్వయం ప్రకాశాలు, అని చెప్పి పంపించారు.” అంజనాద్రి అక్కడున్న చాలా పెద్ద పర్వతం, నిండా దట్టమైన వృక్షాలు ఉన్నాయి వానరులు చెట్ల మీదనుంచి దూకుతూ వెళుతున్నారు. శాతకర్ణిని నేలమీద నుంచి రమ్మన్నారు. శాతకర్ణి నవ్వుతూ నా బాల్యమంతా వృక్షాల ఒడిలోనే జరిగింది అని ఒక్క ఉదుటన చెట్టు ఎక్కి ఊడల సాయంతో చెట్లపై దూకుతూ వెళ్ళాడు.

ఆశ్చర్యపోవడం వానరుల వంతయ్యింది. వారం రోజుల తర్వాత అక్కడి మూలికలు, పండ్లు తినడం వల్ల దేహదారుఢ్యం పెరిగింది శతకర్ణికి, ఆఖరికి అంజనాద్రి మీదకు చేరుకున్నారు. ఇంతలో గాలివానలో వచ్చి శాతకర్ణి తప్పిపోయాడు. అక్కడ ఒక చిన్న గుహలో చేరుకున్నాడు శాతకర్ణి. ఆ గుహలో వృద్ధదంపతులు ఉన్నారు. “వారి వద్దకు వెళ్ళి నేను మూలికల కోసం వచ్చి తప్పిపోయాను అని చెప్పాడు “,శాతకర్ణి. తుఫాను తగ్గకపోవడంతో ఆ వృద్ధ దంపతులకు, ఆహారం నీరు సమకూర్చే వాడు. ఒక రోజు గుహలోకి మొత్తం నీరు వచ్చేసింది ముదుసలి దంపతులు మునిగిపోతున్నారు. అప్పుడు వాయు స్తంభన విద్యతో, తాను మునిగి వారిద్దరినీ పైకి లేపి ఉంచాడు. తుఫాను తగ్గిన తర్వాత తాత ” నాయనా మాకు చాలా సేవ చేశారు. నీ రుణం తీర్చుకోవడానికి ఈ హారం తీసుకో, దారిలో ఉపయోగపడుతుంది అన్నారు. కానీ ఈహారo ఎవరికీ చూపించకూడదు అన్నారు. ఈ హారం వాలికి ఆయన తండ్రి ఇంద్రుడు ఇచ్చింది. ఇది ఎవరు పడితే వారు ధరించలేదు. దీని శక్తిని తట్టుకుని నిలబడలేదు. కాబట్టి నీవు కారణజన్ముడిలా ఉన్నావు. నీవు బలశాలిలా ఉన్నావు,తీసుకో “అన్నారు. శాతకర్ణి హారం వేసుకున్నాడు. కానీ దాని శక్తిని తాళలేక తాతకి ఇచ్చేశాడు. తాత శాతకర్ణితో “అంజనాద్రి చిట్టచివర కొన్ని మూలికలు ఉంటాయి అవి నీకు చూపిస్తాను కానీ నేను అంత ఎత్తు ఎక్కలేను అన్నాడు. ” తాతని భుజం పై వేసుకుని శాతకర్ణి చిట్టచివర పర్వతంపైకి వెళ్ళాడు. అక్కడి చెట్టుకి యక్షులు కాపలా కాస్తున్నారు. అప్పుడు యక్షులతో శాతకర్ణి యుద్ధం చేశాడు. యుద్ధంలో యక్షులు భయంకరంగా పోరాడుతున్నాడు. ఆఖరికి మొలలో ఉన్న సంచిలో ఉన్న సోమవజ్రాన్ని బయటకు తీశాడు. కానీ ఆ కాంతిని తట్టుకుని యక్షులు మళ్ళీ పోరాడసాగారు. వారి యుద్ధ నైపుణ్యం ముందు శాతకర్ణి నిలువలేక పోయాడు. అప్పుడు శాతకర్ణి తాత వద్ద దాచిన హారాన్ని వేసుకున్నాడు. వెంటనే శాతకర్ణి శక్తి పెరిగింది. యక్షులను ఓడించి బంధించాడు.

అప్పుడు ఆ మూలికలను తీసుకుని గుహలోకి వచ్చాడు శాతకర్ణి తాతతో అన్నాడు శాతకర్ణి, ముందు నేను హారాన్ని వేసుకున్నప్పుడు తాళలేక పోయాను, ఇప్పుడు ఎలా భరించగలిగాను అన్నాడు. అప్పుడు తాత “ముందు నువ్వు సందేహంతో వేసుకున్నావు, నాలో ఆ శక్తి ఉందా అని, “ముందు వానరుల చేతిలో ఓటమి గుర్తుకు వచ్చి” ఇప్పుడు నువ్వు నేను యక్షులను ఓడిoచాలి అని సన్నద్ధమై ఈ హారాన్ని ధరించావు. మొదట నీలో అంధకారం పాళ్ళు ఎక్కువ, ఇప్పుడు నీలోని వెలుగు అంధకారాన్ని జయించింది. ఈ హారం యొక్క శక్తి అదే విజయీభవ అని మూలికతో మీ ప్రాంతానికి వెళ్ళు అన్నారు” తాత. ఉత్సాహంతో శాతకర్ణి జాంబవంతుని వద్దకు వచ్చాడు. నాయనా నీకు కావలసిన దేహదారుఢ్యాన్ని, యుద్ధ నైపుణ్యాన్ని కూడగట్టుకున్నావు. ఈ ములికా రసంతో నా సైన్యాన్ని ఇంకా బలంగా తీర్చిదిద్దుతాను అని అన్నారు. అప్పుడు మహారాజు అనిరుద్ధుడు వద్దకు జాంబవంతుడు తీసుకెళ్ళాడు. శాతకర్ణికి నమస్కరించి అనిరుద్ధుడు, మీ తాతగారు మా రాజ్యం కష్టకాలంలో ఉన్నప్పుడూ మాకు చాలా సాయం చేశారు. ఇప్పుడు మీకు ఏమైనా సాయం కావలిస్తే మమ్ములను అడగండి అన్నాడు. అప్పుడు శాతకర్ణి సమయం వచ్చినప్పుడు నేను అడుగుతాను. ఇక్కడ నుండి ఋష్యముఖి పర్వతానికి వెళ్ళాలి అనుమతించండి అని అడిగాడు. మా సంతతి వారు ఆ పర్వతం పైకి వెళ్ళడం నిషిద్ధం. మహా వాలికి మాతoగ ముని శాపం అది ,కావున మీరు ఒంటరిగా వెళ్ళండి అని చెప్పాడు. అప్పుడు ఋష్యముఖి పర్వతం పైకి వెళ్ళాడు శాతకర్ణి.

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000