కాదంబరి (మొదటిభాగం తరువాయి)

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000

మా వివాహమై పదేళ్ళు కావస్తోంది. పెళ్ళైన మూడోయేట సుధాకర్ పుట్టాడు. మరో మగపిల్లాడు కానీ, ఆడపిల్ల కానీ పుడితే ఆపరేషన్ చేయించుకుందామనుకున్నాను. కానీ, ఇంతవరకూ మళ్ళీ అలికిడి లేదు. ‘ఒకసారి టెస్ట్ చేయించుకుందామా?’ అనిపిస్తుంటుంది. ‘ఈ కరువు రోజుల్లో ఒకడు చాల్లెద్దు!’ అని నాలో నేనే మళ్ళీ సమాధాన పడుతుంటాను. ఇంగ్లిష్ మీడియం స్కూల్లో సుధాకర్ మూడో తరగతి చదువుతున్నా డిప్పుడు.

మా సంసారంలో ఏ చీకూ చింతా లేకుండా ఎనిమిదేళ్ళు బాగానే గడిచాయ్. ఆ యేడాది రంగారావ్, వాళ్ళ ఫాక్టరీ వర్కర్స్ యూనియన్ కి సెక్రెటరీగా ఎన్నిక కావడంతో ప్రారంభమైందీ చిచ్చు! బంగారమ్మ భర్త ఆ ఫాక్టరీలో ఫిట్టరుగా పనిచేస్తూ గుండెపోటు వల్ల చచ్చిపోయాడుట. సుశీల భర్త కూడా అక్కడే లేబర్ గా చేసేవాడట. అతను ఓ లారీ ఏక్సిడెంటులో దుర్మరణం పాలయ్యేడు. కట్టుకున్న వాళ్ళు కన్నుమూయడంతో తమకి జీవనాధారం లేకుండా పోయిందనీ, అందుచేత ఆ పోయిన వాళ్ళ స్థానంలో తమకి ఏదైనా ఉపాధి కల్పించమనీ బంగారమ్మా, సుశీలా దరఖాస్తులు పెట్టుకున్నారు.

ఇదంతా, రంగారావు సెక్రెటరీగా ఎన్నికైన ముందు ఏడాది జరిగిన విషయం. ఎప్పటికప్పుడు ఏదో కుంటి సాకు చెబుతూ ఆ ఇద్దరి దరఖాస్తుల్నీ ఓ పారేసింది యాజమాన్యం. తమ విషయంలో శ్రద్ధ వహించి ఏదొక విధంగా తమకు బ్రతుకు తెరువు చూపించడానికి ప్రయత్నించమని ఆ ఇద్దరూ రంగారావ్ చుట్టూ తిరగడం మొదలెట్టేరు. ఆ సందర్భంలో ఆ ఇద్దరూ తరచూ మా ఇంటికొచ్చేవారు. ఐతే, అప్పుడు ఈ ఇల్లు కాదు – వేరే ఇంట్లో వుండేవాళ్ళం.

ఎంతలేదన్నా బంగారమ్మకి ముప్పై ఐదేళ్ళుంటాయ్. అంటే, ఇంచుమించు రంగారావ్ వయసు. ఆమె కిద్దరు సంతానం – ఒక ఆడపిల్ల, ఒక మగ పిల్లాడు. రెండు మూడుసార్లు వాళ్ళని కూడా తీసుకొచ్చింది. చామన ఛాయగా కొంచెం పొడవుగా వుంటుంది తను. చూడ్డానికి భర్త పోయిన బెంగతో కన్పించినా మనిషి నిండుగానే వుండేది. ఇక, సుశీల విషయానికొస్తే – సుమారుగా నావయసే వుంటుంది తనకి. అంటే, బంగారమ్మ కన్నా ఐదారేళ్ళు చిన్నదన్న మాట. పిల్లలు లేరు. ఒకసారి మూడో నెల కడుపు పోయిందని చెప్పింది. కొంచెం తెల్లగా, సన్నగా, నాజూగ్గా బాగానే వుంటుంది మనిషి.

తమ విషయంలో శ్రద్ధ పెట్టేలా రంగారావుకి నచ్చ జెప్పమని నన్ను నాలుగైదు సార్లు బ్రతిమాలారు. ఇవ్వాళ వాళ్ళు ఇలా నాకు సవతులై కూర్చుంటారనుకుంటే – అప్పట్లో వాళ్ళని గుమ్మం తొక్కనిచ్చేదాన్ని కాదు! వాళ్ళ విషయం ప్రిస్టేజి ఇష్యూ క్రింద తీసుకుని యాజమాన్యంతో పోరాడి చివరికెలాగైతేనేం, ఇద్దర్నీ వాటర్ ఉమెన్ గా ఎప్పాయింటు చేయించాడు రంగారావు. అతని ఉపకారానికి కృతజ్ఞతగా బంగారమ్మ వెయ్యి, సుశీల ఐదు వందలూ ఇంటికి తెచ్చి ఇచ్చారు. అదేం వద్దని తనూ, నేనూ ఎంత చెప్పినా విన్పించుకోలేదు. ఆ ఇద్దరూ ఇచ్చిన డబ్బుతో నల్లపూసల హారం చేయించుకున్నాను. అంతవరకూ బాగానే వుంది.

మరి, ఆ తర్వాత రంగారావే వాళ్ళమీద మోజుపడ్డాడో, లేకపోతే తమ గురించి కష్టపడ్డాడని వాళ్ళకే అతనిమీద గ్లామరు కలిగిందో తెలియదు! నాకు మాత్రం ఒక అనుమనముంది. ముందుగా బంగారమ్మే అతనికి ఛాన్సిచ్చివుండాలి. ఎందుకంటే ఆమె నా కంటికి ఆ యావ కాస్త ఎక్కువున్న మనిషిలా కన్పించింది. బంగారమ్మ అతనితో వేయించుకుంటోందని తెలిసాక సుశీలకి కూడ టిమటిమలాడి వుండవచ్చు. పాపం తనకీ భర్త లేడుకదా మరి!

“ఆ మధ్య మీ ఇంటికొస్తుండే బంగారమ్మతో కలిసి రాత్రి మీ ఆయన సిన్మాకొచ్చాడమ్మీ! ఇద్దరూ ప్రక్క ప్రక్కనే కూర్చున్నారు.” అని మా ప్రక్కింటావిడ చెప్పినప్పుడు నా గుండె జల్లుమంది. ఆ రాత్రి ఎంత ఏడ్చానో నాకే తెలీదు! అసలు ఆరోజు నుంచే మా ఇద్దరి మధ్యా గొడవలు ప్రారంభమయ్యేయి. అప్పటిదాకా వారానికి ఒక రోజూ, రెండు రోజులూ లేటుగా వస్తుండే వాడల్లా, నాకా సంగతి ఎలాగూ తెలిసిపోయింది గదా అనో ఏమిటో___ఇక రోజూ ఆలస్యంగా రావడం ప్రారంభించాడు. దాంతో నాకు మరీ కడుపు మండిపోయి ఓరోజు పెద్ద గొడవ పెట్టి సుధాకర్ ని తీసుకుని పుట్టింటికి పోయేను.

నెల్లాళ్ళు పోయాక వరుస వరుసగా మూడు ఉత్తరాలు రాశాడు వచ్చేయమని. అప్పటికా బంగారమ్మ మీది మోజు కాస్త తగ్గివుంటుందేమో అనుకుని వచ్చేశాను. ఇలా ఇంట్లో కాలు పెట్టానో లేదో మా పక్కింటావిడ మరో పిడుగులాంటి వార్త చెప్పింది. “మీ ఆయన ఆ సుశీలను అయిదారుసార్లు ఇంటికి తెచ్చుకున్నాడు. తన సంగతి తెల్సి నువ్వు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళడమే పొరపాటు!” అంది. నాకు గుండె ఆగిపోయింది.

ఆ రాత్రి తనని నిలదీసి అడిగేసరికి నిజం వప్పుకున్నాడు. బంగారమ్మలా సుశీల ధైర్యస్తురాలు కాదట. అదీగాక, మొగుడు పోయినప్పట్నుంచీ ఆమె పుట్టింట్లో వుంటోందట. అందుచేత వాళ్ళింట్లో ఇదవ్వడానికి వీలుపడక ఇంకో చోటుకీ, ఇంకో చోటుకీ తీసుకెళ్ళడమెందుకని ఇంటికి తీసుకొచ్చానన్నారు. ఇంకేమనాలా మనిషినీ? అతనంత నిర్వాకం చేశాక అక్కడుండాలంటే నాకే సిగ్గనిపించింది. వీలైనంత త్వరగా మరో ఇల్లు చూడమని చెప్పేను. ‘అలాగే’ అన్నాడు. కానీ, తానా ప్రయత్నం చేస్తోన్న జాడ కనపడక పోయేసారికి, ఆ తదుపరి నెల నేనే శ్రద్ధ తీసుకుని తిరిగి చివరికీ పోర్షన్ ఫిక్స్ చేశాను.

ఇల్లంటే మార్పించ గలిగానుగానీ, తన చేత ఆ తిరుగుడు మాన్పించడం అంత సులువైన పనా? “నువ్వింత మెత్తగా వూరుకుంటే కాదు! ఆడది మరీ మంచితనంగా ఉంటే మగవాడది చేతకాని తనంగా తీసుకుని ఇంకా చులకనచేసి పారేస్తాడు. నువ్వు కొంచెం మారాలి. మొదట కొంచెం గట్టిగా మాట్లాడ్డం నేర్చుకో” అని సలహా యిచ్చింది నా పరిస్థితిని అర్ధం చేసుకున్న సరోజిని.

ఆమె, మా పక్క పోర్షన్లో వుంటోన్న పాపారావ్ అక్కగారు. మేం అక్కడ దిగిన రెండు నెలలకొచ్చిందామె. ఆవులిస్తే పేగులు లెక్కపెట్టేంతటి తెలివైన ఘటం. గొప్ప కలుపుగోలుగా వుంటోంది. ఇక్కడికొచ్చిన నాల్గు రోజుల్లోనే మా ఆయన తిరుగుడూ దానికి నా ఆందోళనా అర్ధం చేసేసుకుంది. వయసులో నాకన్నా రెండు మూడేళ్ళు పెద్దదైనా, చూడ్డానికి నా ఈడు దానిలానే కన్పిస్తుంది. మనిషి కూడా నాకన్నా బావుంటుంది. కానీ, పాపం, చిన్న వయసులోనే పసుపు కుంకుమలు పోగొట్టుకొంది!

మొదట్లో ఆమె వైఖరి నన్ను కాస్త తికమక పెట్టింది. అప్పటికే ఇద్దరు ముండలు నన్ను పీడలా పట్టుకుని నా సంసారంలో చిచ్చుపెట్టారు. ‘ఇక ఈవిడ గారు గూడా ఏదైనా కథ మొదలెడుతుందేమో బాబూ!’ అనుకునేదాన్ని. ఆ భయం చొప్పునే ఆవిడ ఇంట్లోకొచ్చి ఎంతో కలివిడిగా మాట్లడుతున్నప్పటికీ నేను కొంచెం తటపటా యిస్తుండేదాన్ని.

క్రమంగా తన తత్వం తెల్సిన మీదట మనసిచ్చి మాట్లాడటం మొదలెట్టాను. పట్టుమని అయిదు సంవత్సరాలు గూడా కాపురం చేయలేదుట తను. ఒక రాత్రప్పుడు కడుపు నొప్పి వచ్చి విపరీతంగా బాధపడి హాస్పిటలుకి తీసుకెడుతోంటే ఆ దారిలోనే ప్రాణం పోయిందట అతనికి. అపెంటసైంటిస్ అలక్ష్యం చేయటం వల్ల ఆ గ్రహచారం జరిగిందట. పిల్లలు గూడ లేరు పాపం! మొగుడు పోయాక మరింక అక్కడ ఉండబుద్ధి కాక పుట్టింటి కొచ్చేసిందట. అప్పుడప్పుడు ఇలా తమ్ముడి దగ్గరకొచ్చి రెండు మూడు నెలలు వుండి వెడుతుంటుందట.

రంగారావు ఆ మాయ ముండలకి మరిగి నన్ను అలక్ష్యం చేస్తున్నాడనే గుండా పిండి అయిపోతున్నాను. వారానికోసారో పదిరోజులకోసారో పని జరుగుతున్నప్పటికీ మనసు తీరక శ్లేష్మంలో పడ్డ ఈగలా కొట్డుకుంటున్నాను. అటువంటిది____’సరోజిని మొగుడు పోయిన ఇన్నేళ్ళనుంచీ ఎలా వుండగలుగుతోందా?’ అనుకునేదాన్ని. ఆ మాట తనని అడగడానికి మొహమాట పడుతుండేదాన్ని.

ఒకరోజు___అనుకోకుండా నా ప్రశ్నకి సమాధానం దొరికింది.


(ఇంకా వుంది)

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000