కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 8

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000

ఉదయభానుని కిరణాల తీక్షణ శరీరాన్ని తాకు తుంటే మెలుకవ వచ్చింది, టైం చుస్తే 8.30 అంత లేటుగా ఈ మద్య కాలంలో ఎప్పుడు లేవలేదు. లేచి కాలకృత్యాలు తీర్చుకొని మేము టిఫిన్ చేస్తూవుండగా శాంత వాళ్ళ నాన్న గారు వచ్చారు.

శాంతా విషయం అంతా చెప్పి అక్కడ ఎన్ని పెట్టెలు ఉండేది అందులో ఎటువంటి సంపద ఉండేది అంతా చెప్పింది. ఆ తరువాత ఇప్పుడు ఉన్న చట్టం ప్రకారం ఎం చేయాలో మీరే చెప్పండి అని అడిగింది.

శాంతా తాతగారిలా కాక ఆయన ఓ నిజాయితీ పరుడైన అఫిసరులా , నిజమే ఆ డబ్బు మనకు వద్దు , కానీ మనకు వారసత్వంగా వచ్చింది చాల్లే , మరి దాన్ని ఎలా బయటకు తీయాలి అంటూ తనే ఆలోచించ సాగాడు.

శివాకు తెలిసిని ఫ్రెండ్ ఉన్నాడు ? “ఎం శివా ? ఎలా దీన్ని బయటకు తీద్దాము. “

“సార్ నాకు ఈ రోజు టైం ఇవ్వండి నేను టౌన్ కు వెళ్లి అన్ని చక్కబెట్టుకొని వస్తాను , అన్ని సరిపోతే రేపు కానీ ఎల్లుండి కాని సరియైన వ్యక్తులతో ఇక్కడ ఉంటాను” అని చెప్పి కారు తీసుకోని సరిగ్గా రాయచోటికి వచ్చి అక్కడ ప్రతాప్ ను తీసుకోని డైరెక్టుగా కడపకు వచ్చాము.

దారిలో జరిగింది అంతా ప్రతాప్ కు చెప్పగా వాడు ఫోన్ లోనే అన్ని విషయాలు కలెక్టరుతో మాట్లాడి , కావలిసిన వ్యక్తులతో మీటింగ్ కు మద్యానం భోజనం తరువాత అక్కడే కలెక్టర్ అఫీస్ లో ఏర్పాటు చేసాడు.

మేము వెళ్ళే సరికి సరిగ్గా మీటింగ్ టైం అయ్యింది. అక్కడ కలెక్టరు , దేవాదాయ శాఖకు , పురావస్తు శాఖకు సంబందించిన అధికారులు ఉన్నారు. నేను జరిగిన విషయాల్ని క్లుప్తంగా వివరించాను.

అందరూ ఓ మాట మీదకు వచ్చి రేపు ఉదయం అందరూ కలిసి అక్కడికి వెళ్లాలని రేపు పూర్తిగా ఆ నిధిని ప్రభుత్వ పరం చేసుకొని ఆ తరువాత మిగిలిన ఫార్మాలిటిస్ ముగిద్దామని చెప్పారు.

మేము ఆ రాత్రికి రాయచోటిలో ఉంటాము , వాళ్ళ గ్రూప్ లో దారిలో జాయిన అవుతామని చెప్పి ఆ రాత్రికి రాయచోటికి వచ్చేసాము. ఆ రాత్రికి రాయచోటి లో ప్రతాప్ వాళ్ళ ఇంట్లో పడుకొని పొద్దున్నే కడప నుంచి వచ్చిన గ్రూప్ తో కలిసి పల్లెకు బయలు దేరాము.

మొత్తం 10 వెహికల్స్ లో రక రకాల ఆఫిషర్లు , ఓ రెండు జిపుల నిండా రకరకాల పత్రికా విలేకర్లు , ఓ పెద్ద ట్రక్ నిండా CRPF force తో ఉదయం 11 గంటలకు ఆ పల్లెలో దిగాము.

అన్ని వెహికల్స్ , అంత మంది జనాలను చుసేకొద్ది , ఉరి వాళ్ళకు ఏమి జరుగుతుందో అర్తం కాలేదు. నేను మేము వచ్చే విషయం ముందే చెప్పడం వలన శాంతా వాళ్ళ నాన్న , సర్పంచి సహాయంతో తన ఇంటి ముందు పెద్ద టెంట్ వేయించి అక్కడ ఓ 50 కుర్చీలు వేయించి , ఓ 50 మందికి భోజన సదుపాయాలూ మొదలైన వాన్ని చూసాడు. మేము వస్తూనే అందరూ కాఫీలు తాగి, 11.30 లకు బయలు దేరి దిరేక్ట్ గా ఆ గుట్ట దగ్గరకు వెళ్ళాము.

నాతొ పాటు ఇంకో ఇద్దరు ఆఫీసర్స్ , మరియు ఓ 5 మంది పనివాళ్ళు రాగా , బావిలో దిగి అక్కడ నుంచి సొరంగం లోకి వెళ్లి నేరుగా నిధి ఉన్న ప్లేస్ కు వెళ్లి అక్కడ నుంచి ఉన్న ఇంకో దారి నుంచి గుట్ట పైకి ఉన్న సొరంగం ఓపెన్ చేసాము. అప్పుడు అక్కడికి చేరిన అందరూ కిందకు దిగారు.

అందరూ చూస్తుండగా, ఆ తలుపులు ఓపెన్ చేసి లోనకు వెళ్ళాము. అక్కడున్న సంపద చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కలెక్టర్ అధర్యం లో అన్ని సరిగ్గా లెక్క పెట్టి విలేకరులు ఫోటోలు తీసుకొంటుండగా కడప నుంచి తెచ్చిన పెట్టెల్లో అక్కడున్న సంపదంతా సర్ది వాటికి సీల్ వేశారు

అన్ని పెట్టెలు లెక్క పెట్టి ఎస్కార్టు ఉన్న వ్యాన్ లోకి ఎక్కించారు. అవి పైకి వెళ్ళగానే , పురావస్తు శాఖ నుంచి వచ్చిన ఆఫీసర్స్ మాత్రమె అక్కడ ఉన్నారు మిగిలిన అందరూ అక్కడ నుండి కడపకు బయలు దేరారు. వారిలో కొందరు రెవిన్యు శాఖ నుంచి వచ్చిన వారు రాయచోటి తాలుకా ఆఫీసులో వుండి పోయారు ఏవో డాక్యుమెంట్స్ వెతకడానికి.

రెవిన్యు వాళ్ళు తగిన రికార్డ్లు వెరిఫై చేసి అప్పుడు శాంతా వాళ్ళ తాత గారి వంశం లో ఎందరు వున్నారు అని తేల్చి వాళ్లకు తగినట్లు గా వాటాలు ఇస్తామని శాంతా వాళ్ళ తాత గారికి , సర్పంచ్ వాళ్ళకు చెప్పి వెళ్ళారు.

వచ్చిన విలేకర్లకు అందరికి ప్రతాప్ న్యూస్ ఇచ్చాడు , నాపేరు బయటకు రాకుండా శాంతా పేరు మాత్రమె వచ్చేటట్లు, నేను తనకు సహయకుడిగా మాత్రమె పని చేసినట్లు. ప్రతాప్ నన్ను కుడా తనతో పాటు కడపకు రమ్మన్నాడు.

శాంతా వాళ్ళ నాన్న వెళ్ళమని చెప్పగా తనతో పాటు నేను కుడా ఆ వాహనాల వెంట కడపకు చేరుకొన్నాను. కలెక్టర్ అధర్యం లో వాటిని బ్యాంక్ లాకర్లో ఉంచారు. ఆ కార్యక్రమం అయిపోయిన తరువాత అక్కడ పెద్ద ఎత్తున ఎస్కార్ట్ ఉంచి మిగిలిన వారు ఎవరి ఇళ్ళకు వాళ్ళు డిస్పెర్స్ అయిపోయారు. నేను ప్రతాప్ రాయచోటికి వచ్చేసాము.

నేను ప్రతాప్ తో పాటు వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడే పడుకొని పొద్దున్నే లేచి రామిరెడ్డి వాళ్ళ షాప్ కు వెళ్లాను.

అన్ని పేపర్లలో మెయిన్ హెడ్డింగ్ తో వెలికి తీసిన సంపద న్యూస్ వచ్చింది. ప్రసాద్ చెప్పినట్లుగానే నా పేరు బయటకు రాకుండా, క్రెడిట్ అంతా శాంతా కు దక్కేటట్లు తన డ్రైవర్ సహాయంతో ఆ సంపద నంతా వెలికి తీసినట్లు వచ్చింది.

మద్యానం వరకు అక్కడే వుండి ఆ తరువాత , రామిరెడ్డి వాళ్ళ కారులో ఇంటికి బయలు దేరాము.

కారులో కూచొన్న దగ్గరనుంచి ఎందుకో మనసులో ఎదో తెలియని అనిజినేస్స్ కలగా సాగింది. డ్రైవర్ కారు నడుపుతుండగా నేను ముందు కుచోన్నాను , సర్పంచ్ వెనుక కుచోన్నాడు. వెనుకకు తిరిగి ఆయన వైపు చూసాను. “ఏమైంది శివా ? ” అన్నారు “మీరు ఏమైనా మరిచిపోయారా సారూ ? ” “లేదే ఏమైంది ? ఎందుకు అలా అడుగుతున్నావు.” “ఎం లేదు ఎదో మరిచిపోయినట్లు అనిపిస్తుంది” “నేనేం మరిచిపోలేదు , నీవు ఏమైనా తెచ్చావా , చూసుకో వో సారి” అంటూ కారును కొద్దిగా పక్కన నిలబెట్టమని డ్రైవర్ కు చెప్పాడు. అంత వరకూ మా వెనుక వస్తున్న రెండు ఆటోలు మమ్మల్ని ఓవర్ టెక్ చేసి మా ముందుకు వచ్చి ఆగాయి.

అందులోంచి, 19 నుంచి 25 ఏళ్ల వయసున్న కుర్రాల్లు చేతిలో బ్యాట్ లతో మా కారు మీదకు దాడికి దిగారు. వాళ్ళు ఎవరో ఏంటో నాకు తెలియదు మరి మా మీదకు ఎందుకు దాడి చేస్తున్నారో అంత కన్నా తెలియదు.

ఇద్దరు కారు విండ్ స్క్రీన్ పగల గొట్టారు , ఇంకో ఇద్దరు డ్రైవర్ ను బయటకు పికి అవతలికి నెట్టేశారు. మిగిలిన గుంపు అంతా ముందు కూచొన్న నన్ను టార్గెట్ చేసారు. కారులోనే ఉంటె వాళ్లకు దొరికో పోతాను, వెనుకున్న పెద్దాయనకు ఏమైనా కావొచ్చు అని , డోరు తీసుకోని బయటకు దుమ్కాను.

నేను బయటకు రావడం చూస్తూనే “మారో , సాలేకో ” అంటూ పోలో మని అందరూ నా మీదకు దూకారు ఆ గుంపులో దూరి పిడికిళ్ళకు పని చెపుతూ , కారుకు దూరంగా పరిగెత్తాను.

పరుగెత్తుతూనే వెనుకకు చుస్తే అక్కడ కారు దగ్గర డ్రైవర్ పక్కన ఉన్న ఇద్దరు కుడా వాడిని వదిలేసి నా వెంట పడ్డారు.

నాతొ పాటు నా వెనుక అందరూ కేకలేస్తూ గుంపుగా పరుగెత్త సాగారు. ఆలా పరుగెడుతూనే షాప్ లోకి ఎండ రాకుండా రెండు కట్టెలు పట్టి ఆ కట్టెల పైన తార్పాల్ లాగా వేసి ఉన్న షాప్ ముందు వెళుతూ పైకి ఎగిరి ఆ కట్టేల్లో ఓ దాన్ని చేజిక్కించు కొన్నాను. చేతిలో బాగా ఇమిడిపోయింది ఆ వెదురుబొంగు.

అది చేతికి దొరక గానే ఎదురు తిరిగి ముందు వచ్చే వాటి బుజం మిద శక్తి కొద్ది కొట్టాను. “మై మర్గయా రే ” అంటూ బుజం నుంచి జారిపోయిన చేతిని పట్టుకొని అక్కడే కూల బడ్డాడు. వాడు కింద పడగానే వాడి వెనుక ఉన్న వాళ్ళు నా చుట్టూ మూగారు తమ చేతిలోని బ్యాట్లతో.

నా చేతిలో కర్ర నా పైన 5 అంగుళాలు పొడవుంది. ఆ కర్ర మద్యలో పట్టుకొని రిథమిక్ గా అడుగు లేస్తూ కర్ర తిప్ప సాగాను. ఆ కర్ర నుంచి ఓ రకమైన శబ్దం వెలువడుతూ వాళ్ళను భయపెట్ట సాగింది. అలా తిప్పుతూ ఏట వాలుగా నా ఎదురున్న వాడి కాళ్ళ మిద ప్రయోగించాను. “ఫట్ మంటూ అక్కడ ఎదో పచ్చి కొమ్మ విరినట్లు చప్పుడుతో పాటు యా అల్లా” అంటూ పెద్ద కేక వినపడింది. ఆ సౌండ్ నా చెవులకు చేరనట్లు అలాగే వెనుక్క తిరిగి వెనుక ఉన్న వాడి తలను తాకింది ఆ వెదురు బొంగు, అక్కడేదో కొబ్బరి కాయ కొట్టినట్లు వచ్చిన సౌండ్ ఆ తల ఉన్న వాడి నోట్లోంచి వచ్చిన కేకతో కలిసి పోయింది.

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000