కలసి వచ్చిన అదృష్టం(శతదృవంశ యోధుడు) – పార్ట్ 3

రావీల్ల ఇంట్లోంచి కుడా తప్పకుండా బలులు వెళ్ళాలి , కాని విళ్ళకు ఎదో ముట్టు వుండడం వలన ఈ ఏడాది తిసికేల్లలేదు. శాంతాకు ఇవ్వ వలిసిన మాత్రలు నా దగ్గరే ఉన్నాయి. లోనకెళ్ళి తనకు మాత్రలు ఇచ్చి “సారీ , మేడం నేను అక్కడ గట్టిగా కొరకాల్సింది కాదు , కానీ అప్పుడు మీకు విషం ఎక్కకూడదు అనే ద్యాస తప్ప వేరే ఏమి బుర్రలో లేదు అందుకే అంతగా అలోచించ లేక పోయాను” అని మాత్రలు అక్కడ పెట్టి వెనుకకు రాబోయాను. తను నా చేయి పట్టుకొని “ఏడుస్తూ , సారీ నువ్వు ఎందుకు చెపుతున్నావు , నేను వెర్రిదాని లాగా నీ మీద అరిచాను , ఇంకెప్పుడూ నన్ను మేడం అని పిలవద్దు మెన్ననే చెప్పా కదా శాంతా అని పిలువు అని ”

“అలాగే , మీరు ముందు ఏడుపు ఆపండి , ఇంట్లో ఎవరన్నా చుస్తే నేను ఎదో చేశాను అందుకే నువ్వు ఏడుస్తున్నావు అనుకుంటారు ” ఆ మాటకు నవ్వుతూ ” నువ్వు నిజంగా ఏమైనా చేసినా ఎవ్వరూ ఎమీ అనరు , మా తాత నీ మీద ఈగ కుడా వలనిచ్చే తట్లు లేడు ” “మేమంతా గుడి దగ్గరకు ఆ తరువాత తిరుణాలకు వెళుతున్నాము , మీరు వస్తారా ?” “నువ్వు ఎత్తుకొని తీసుకేలతావా ” అంది నవ్వుతూ

“మీరు వస్తానంటే తీసుకేలతా , కాకుంటే కొద్దిగా బరువున్నారు ” “అంటే నీ ఉద్దేశం నేను తిని కొవ్వు ఎక్కినాననేగా ?? ” “అయ్యయ్యో నేను అలా అనలేదు , అంత దూరం మోయాలంటే కొద్దిగా బోరువు అనిపిస్తారు అన్నాను ” “నీకు బరువుగా ఉంటే , నేనేమి రానులే , నేను చాలా సార్లు చూసాను , మీరు అందరు వెళ్ళండి , మా అత్తా కుడా వస్తుంది. ” “ఈ మాత్రలు వేసుకోండి ” అంటూ అక్కడ నుండి బయటకు వచ్చాను.

అందరు బయట వున్నారు తయారుగా , రాజి వాళ్ళ అమ్మ ఇంకా రాలేదు ఆవిడ కోసం వెయిటింగ్ అందరు. ఓ ఐదు నిమిషాలు తరువాత వచ్చింది. పట్టుచీర కట్టినట్లు ఉంది. దాని వలన కొద్దిగా వయస్సు ఎక్కువుగా అనిపిస్తుంది ఇంతకూ మునుపు చుసిన దానికంటే. తను వస్తూనే అందరం, ఊర్లోకి వెళ్ళాము అక్కడ ప్రభలు ( ఎవరైనా దేవుడికి ముక్కు తిర్చు కోవాలంటే కొన్ని గుళ్ళకు ఈ రకమైన ఊరేగింపుతో వెళతారు ఇవి మాములు ఎద్దుల బండికి రక రకాలుగా అలంకరించి, వాటికి జనరేటర్ ద్వారా రంగు రంగుల బల్పులు వేసి తిసికేల్తారు , వీటినే చాందినీ బండ్లు అనికూడా అంటారు ఓ ప్రాంతం వైపు )

రాజీ నా చేయి పట్టుకొని , పక్కనే నిర్మల తన వెనుక జలాజ మా ముందు రాజి వాళ్ళ అమ్మ. ఊరులోని జనాలంతా అక్కడే వున్నట్లు వున్నారు.

బండ్లు బయలుదేరాయి అందానికి సూచికగా , డప్పులు మొగ సాగాయి, డానికి తోడుగా పెద్ద పెద్ద కొమ్ము బుర్రలు, పలకలు ఖణేల్ … ఖణేల్ వాటికీ తోడుగా మేళాలు అన్ని రిథ మిక్ గా మొగ సాగాయి. ఆ బండ్లు ముందర , భజన బృందం వాటి కంటే ముందు , కొలాట బృందం డప్పులకు అనుగునంగా ఆడుతున్నారు. ఆ సౌండ్ కు జనాలలో ఓ విధమైన వైబ్రెసన్స్ రాసాగాయి. నాకైతే వెంట్రుకలు నిక్క బోడుచుకున్నాయి.

ఆ దప్పుల శబ్దానికి , ఎప్పుడు వచ్చిందో నిర్మల నా రెండో చేతిని గట్టిగా పట్టుకొంది , ఇంకో చేయి రాజి చేతిలో నలుగుతుంది.

వీటికి అన్నిటికి ముందు పోతు రాజును( ఈ గుడి అమ్మవారు గుడి, ఇక్కడి జనాలు దీనిని అమ్మోరు గుడి అంటారు , కాళికా మాత అంశ, కాని వీళ్ళకు మాత్రం అమ్మోరు , ఆ అమ్మోరు దగ్గర కావలి లాగా పోతు రాజు ఉంటాడు , తన చేతిలో ఓ కాత్తి వుంటుంది , ఆ విగ్రహాన్ని ఎత్తుకోవడానికి వీలుగా పీట లాంటి దాని మీద తాయారు చేస్తారు.) ఎత్తుకొని ఓ వ్యకి బండ్ల ముందు ఎగురుతున్నాడు. ఆయన ముందర బలి కి ఇవ్వాల్సిన ఓ దున్నపోతు , 4 పోట్టెండ్ల ను బాగా అలంకరించి తిసికేలుతున్నారు.

ఆ ఊరేగింపు అలా గుడి దాకా వెళ్ళింది. అన్ని గుడి ముందు ఆపి బలికి అన్ని సిద్దం చేసారు.

తలారి రాముడు చేతిలో పెద్ద వేట కొడవలి అక్కడున్న లైట్లు పడి మెరుస్తుంది. ఒక్క వేటుతో దున్నను నరకాలంట లేకుంటే ఆ చుట్టూ పక్కల గ్రామాలకు అపసకునం అని వాళ్ళ నమ్మకం. ఆ దున్నను దాదాపు నాలుగు ఐదు సంవత్సరాలు మేపారంట. దానికి తలుగు పెట్టరు , పుట్టిన వెంటనే వదిలేస్తారు అది తల్లితో పాలు తగెంత వరకూ ఆ తల్లి పాలు కుడా పిండారు. అది ఎ పోలములో మేసినా ఎవ్వరు ఏమి అనరు , ఆలాగా బాగా తిని బలిసింది దాని మెడ చిన్న సైజు దూలం లా ఉంది.

గుడి దగ్గర సర్పంచ్ వాళ్ళ ఫ్యామిలి మొత్తం ఉన్నారు. అక్కడ నుంచి మా గ్రూప్ ను చూసి దగ్గరకు రమ్మని పిలిచారు. వాళ్ళ పాలేరు వచ్చాడు మమ్మలి లోపలి తీసుకెళ్ళడానికి. అక్కడనుంచి గుడి ముందు జరిగేది బాగా కనబడుతుంది. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి లోపల పూజ ముగిసింది

డప్పుల వేగం పేరిగింది దానికి అనుగునంగా , జనాలలో అరుపులు ఇంతలో ” కో బలీ…………..కో బలీకో బలీ…………..కో బలీ………….. ” అంటూ తలారి రాముడు ఎగురుతున్నాడు. వాడికి వంత పాడుతూ జనాల అరుపులు. ఆ జనాలలో ఎదో తెలియని ఆవేశం , ఉత్సాహం , కసి , భక్తి అన్నీ కలిపి ఆ ప్రాంతంలో ఓ విధమైన ఎలక్ట్రిసిటీ ( కరెంటు ) పాకుతుంది. సైంటిఫిక్ గా దిన్ని ఏమంటారో , సైకాలజీలో దీనికి ఎపెరుందో నాకు తెలీదు. జనరల్ గా దేవుడంటే పెద్దగా ఇంటరెస్ట్ చూపని నేను కుడా ఆ గుంపులో ఒక్కడినై వాళ్లతో పాటు స్పందిస్తున్నా నాకు తెలియకుండానే.

ఆలా ఓ ఐదు నిమిసాలు పాటు డప్పులు మొగి చివరిదశకు వచ్చేసరికి , అలా ఆ దున్న చుట్టూ అరుస్తూ ఎగురుతున్న రాముడు దున్నకు ఓ వైపు వచ్చి ఒకే ఒక్క వేటుతో దాని తల నరికేసాడు. అక్కడే వున్నా పూజారి దాని తలను తీసికొని గుడిలోకి తీసికెళ్ళి నైవేద్యం లాగా పెట్టి వచ్చాడు. వెంట వెంటనే మిగిలిన వాటినన్నిటిని బలిచ్చేసారు.

గుడి ముందు ఎర్రని తివాచి పరచి నట్లు రక్తం. ఈ బలులు చూడలేక నిర్మల తన తలను నా బుజానికి తాకించి పట్టుకోని గట్టిగా కళ్ళు మూసుకోంది ఆ బలుల కార్యక్రమం పూర్తీ అయ్యేంత వరకు. రాజి పూర్తిగా గుడ్లు అప్పగించి మరీ చూస్తుంది. జలజ, రాజి వాళ్ళ అమ్మ ఇద్దరు గుడి లోపలి వెళ్ళి బండారు తెచ్చారు ( సాయి గుడిలో విబూది ఎలాగో అక్కడ బండారు అలాగా ) . భక్తితో తలా కొద్దిగా తీసుకోని నుదిటి మీదా , తలమిదా పెట్టుకొన్నారు. దేవతా విగ్రహం ఎలా వుందో చూద్దాం అని నేను లోపలి వెళ్లాను, విగ్రహం చాలా భీకరంగా ఉంది , అందుకే చిన్న పిల్లల్ని ఒక్కరినే రానియరు అంట,కాళీ మాత విగ్రహమే. కాని పైన అలంకరణలు బాగానే చేసారు. తన తలలోని పాపిట బిళ్ళ నా దృష్టికి వచ్చింది. అది కుడా శాంత మేడలో వున్నా లాకెట్ లాగే ఉంది కాని లంకరణలో కొద్దిగా వేరుగా అనిపిస్తుంది. ఇప్పుడు దానిని తీరికగా చూసే టైం లేదు తరువాత చూద్దాం అని మా గుంపులో కలిసి పోయాను.

పూజా కార్యక్రమాలు అయిపోయి అమ్మోరికి నైవేద్యం పెట్టిన తరువాత అక్కడ ఎవ్వరు ఉండ కూడదు , అంతా ప్రభల వెంట తిరగ సాగారు. అక్కడే ఉన్న ఖాలీ ప్రదేశం లో భజన , కోలాట బృందాలు వాళ్ళ వాళ్ళ ప్రదర్సనలు ఏర్పాటు చేస్సారు , జనలు గుంపులు గుంపులుగా విడిపోతూ ఆ ప్రదేశాలలోకి వెళ్లి పోయారు. కొందరు ప్రభల వెంట వెళ్ళారు.

ఊర్లో ఉన్న కుర్ర కారు బృందం సీతా కోక చిలుకుల లాగా తయారయిన అమ్మాయల వెంట తిరుగుతూ , వాళ్ళ కేమైనా చాన్స్ దొరుకితే వాళ్ళను ఎలా పటాయించీ కొద్దిదూరం తిసికొల్లి అక్కడే చికటిలో పని కనిద్దమా మా అని ఎదురు చూస్తూ వాళ్ళు ఎక్కడికి వెళితే అక్కడికి వేళ్ళ సాగారు.