అసలు కథ – Part 14

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000

పార్టీ అయిపోయిన తరువాత అందరు స్నేహితులతో పాటు సావంత్ కూడా సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. తన అందరి స్నేహితులతో హుందాగ నడచుకొన్న రీతి గగన్ కు చాలా సంతోషమయ్యింది.

చెప్పినట్టుగానే మరునాడు అందరూ వెళ్ళిపోయిన తరువాత ల్యాండ్ లైన్ కు సావంత్ ఫోన్ చేసాడు.

మోహన :- చెప్పు సావంత్ అంది గంభీరంగా. . . నేను మీ ఇంటికి ముందే ఉన్నాను మోహనా రమ్మంటే లోపలికొస్తాను. సరే రా అని బయట లాన్ లోనే చెట్టుకింద కుర్చీలేయించింది.

సావంత్ తటపటాయిస్తూ ఉంటే. . .మోహనే కలగజేసుకొని ఏదో చెప్పాలన్నావుగా సావంత్ చెప్పు అంది.

సావంత్ : మోహనా నీకు గగన్ భర్తయితే నాకు చిన్న నాటి నుండీ స్నేహితుడు ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. . .మా ఇద్దరి గురించి కూడా ఆంటీ అంకుల్ కు తెలుసు. .. . మా ఇద్దరి రిలేషన్ షిప్ ను ఆంటీ వాడుకోవాలని చూస్తోంది. మోహన :- చూడు సావంత్ . . . ఇక నా జీవితం ఇంతే . . ఇలానే జీవితం ముగిసిపోతుందనే సమయానికి ఓ తండ్రి లాగా నన్ను ఆ ఊబిలోనుండి పైకిలాగి నాకో జీవితాన్ని ఇచ్చాడు గగన్. . .గగన్ నా జీవితంలోనికి రావడానికి నువ్వు కూడా కారణం . . .అలా అని సెంటిమెంట్ పెట్టుకొనే రకం కాదు నేను. . .ఆకలికి తట్టుకోలేకనో. . .ఒళ్ళునెప్పుల కోసమో. . . నాటు సారా తాగి విటులిచ్చింది తిని పడుకొనే మోహన ఎప్పుడో చచ్చిపోయింది. ఇప్పుడు నాకంటూ ఓ సంసారం, ఇల్లూ వాకిలీ ,అత్తయ్యా ,మామా , అందరూ ఉన్నారు. నాలాంటి దానికి ఇంతకన్నా స్వర్గం ఉంటుందని నేను అనుకోవడం లేదు.. . .ఇలాంటి సమయంలో నీవు నన్ను మళ్ళీ నా పాత జీవితం ఆసరగా చేసుకొని మళ్ళీ నా జీవితం లోని కి రావాలని ప్రయత్నించవద్దు.

అంత స్పష్టంగా మాట్లాడుతున్న మోహనను చూసి సరిగ్గా నాలుగైదు నెలల క్రితం గుడెనెకాల సారా కోసం తనకు కాలెత్తిన మోహనేనా ఇది అనిపించింది. అదే సమయంలో మాట్లాడిన మాటలన్నీ తనను ఉద్దేశించినవే అని అర్థం అవుతూ ఉంటే సారీ మోహనా. . .నీవు ఇలా అంటం లో తప్పులేదు కాని అప్పటి పరిస్థితి వేరు ఇప్పటి పరిస్థితి వేరు. నీవిప్పుడు నా స్నేహితుడి భార్యవి. .. వాడి ఉన్నతమైన భావాలు వ్యక్తిత్వం వాటినే చూసే ఇంతకాలం వాడితో నేను స్నేహితుడిగా మిగిలిపోయాను.అందరి కుర్రాళ్ళకు మల్లే మేము కూడా ఎంతో కొంత ఎంజాయ్ చేసినా వాడిది చాలా సున్నితమైన మనసు. పైగా అందగాడు కూడా ఎంతో మంది వాడిని తమ వాడిగ చేసుకోవాలని ప్రయత్నించినా కూడా తన తల్లితండ్రుల మాటకే ఎక్కువగా విలువిస్తానని చెప్పి తప్పించుకొనేవాడు. అలాంటిది తన తల్లి తండ్రులను కాదని వాడు నిన్ను పెళ్ళి చేసుకొన్నాడంటే మీ ఇద్దరి మనసులు ఎంతగా కలిసిపోయాయో అర్థం చేసుకోగలను. . . మీ విశయం తెలిసి సంతోషపడిన వారిలో బహుశా నేనే మొదటి వాడిని కావచ్చు . . .కానీ మీ ప్రేమ వ్యవహారం అంకుల్ అర్థం చేసుకొన్నంతగా ఆంటీ అర్థం చేసుకోవడం లేదు. . .అలా అనే దానికన్నా నిన్ను శాశ్వతంగా గగన్ కు దూరం చేయాలని చూస్తోంది. సావంత్ ఎక్స్ప్లనేషనుతో తాను కన్వీనెన్స్ అయినట్టుగా తల ఊపుతూ సూటిగా విశయం చెప్పు సావంత్. . . నువ్వు ఈ మధ్య తరచూ ఇంటికొచ్చి వెళుతున్నావు. . .నేను రాంగానే లేచి వెళ్ళిపోతున్నావు.. . . అదీ కూడా గగన్ లేని సమయంలోనే ఎందుకు. .. . .నీ విశయం గగన్ తో ఎప్పుడో చెబుదామనుకొన్నాను. . .కాని నా అంతట నేను నీ గురించి చెబితే నా భర్త ఎక్కడ బాధపదతాడోనని చెప్పలేదు. సావంత్ : ఆ . . .అక్కడికే వస్తున్నా మోహనా . . . ఆంటీ కి నువ్వంటే సుతారామూ ఇష్టం లేదు. . .డైరెక్ట్ గా నిన్ను ఏం చేసినా తమ కొడుకు ఎక్కడ తమకు దూరమవుతాడో నని . .. . నా ద్వారా గగన్ కు నీ మీద అనుమానం వచ్చేలాగా ఇంటికొచ్చి వెళుతూ ఉందమని ఆంటీనే చెప్పింది.. . .ఒక్క సారి గగన్ కు నీకు పొరపొచ్చాలు వచ్చిన మరుక్షణం నీ హిస్టరీ మొత్తం బయటకు లాగి నిన్ని గగన్ కు దూరం చేయాలని తను భావిస్తోంది. మోహన ఒక్కసారిగా షాక్ కు గురయ్యింది. తన వెనకాల ఇంత మాస్టర్ ప్లాన్ జరుగుతోందా అని మ్రాన్ పడిపోయింది. భయమూ ,దుఖమూ రెండూ కలగా పులగంగా మెదడును తినేస్తుంటే తల పట్టుకొంది. సావంత్ కూడా ఏం చెప్పకుండా మౌనం వహించాడు.

కాసేపు మౌనం తరువాత మోహన సర్దుకొంటూ సావంత్ ఇలా చెయడానికి ఆంటీ నీకు ఏం అఫర్ చేసింది. . .ఆంటీ చెప్పినట్టు కాకుండా నువ్వు ఇలా డబల్ క్రాస్ చేసి విశయం నాకు లీక్ చేయడం వల్ల నానుండి ఏం ఆశిస్తున్నవు అంది.

సావంత్ ఆమె షార్ప్ నెస్ కు ముందు చూపుకు అబ్బురపడుతూ. . .కరెక్ట్ గానే ఊహించావు మోహనా. . .ఒకవేళ ఆంటీ చెప్పినట్లు నడచుకొంటే. . . పనయిన తరువాత. . . తమ కంపెనీలో టెన్ పర్సెంట్ షేర్లు నా పేరున ట్రాన్స్ఫర్ చేస్తానన్నది. అంటే సుమారు 60 70కోట్లు . . .అంత పెద్ద మొత్తాన్ని వద్దనుకొన్నది కేవలం నా స్నేహితుడి కోసమే. . .. . .నీ నుండి ఏదీ ఆశించదం లేదు. మోహన :- నిజమా సావంత్ అంది గొంతు వణకుతుండగా. . . సావంత్ : నిజం మోహనా నా విశయంలో నువ్వు ఇంకేం అనుమానాలూ పెట్టుకోవల్సిన అవసరం లేదు. తొందరలోనే నేను జార్జియా కు వెళ్ళిపోతున్నాను. నా పెళ్ళికో లేదా మీకు పిల్లలయిన తరువాతో నా ఇంటికి రండి. కాని నీవు జాగ్రత్త. నేను కాకపోతే ఈ పని వేరే వారితోనైనా చేయిస్తుంది. లేదా మూడో కంటికి తెలీకుండా నిన్ను హత్య చేయించవచ్చు.

కన్నీళ్ళు కళ్ళ చివరకొచ్చేసాయి మోహనకు.. . . దుఖం ఆపుకొంటూ. . .ఇప్పుడు ఏం చేయమంటావ్. .సావంత్. . . నేను గగన్ కు దూరమయి బ్రతకలేను.. . .అలా అని ఇక్కడ దిక్కులేని చావు చావలేను. . .

సావంత్ ఏం మాట్లాడకుండా గోళ్ళు గిల్లుకొంటూ కూచొన్నాడు.

రెండు నిమిషాలు మౌనంగా లోలోపలే ఆలోచించిన మోహన ఏదో నిర్ణయానికొచ్చినట్లుగా. . . సావంత్ . . .నీవు జార్జియా వెళ్ళిపోయేంతలోపు ,నాకు ఓ సాయం చేసిపెట్టగలవా అంది.

సావంత్ : చెప్పు మోహనా

మోహన తన ప్లాన్ ను వివరించి . . .ఆంటీ నిజ స్వరూపం ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. . .ఇకపై అసలు కథను నేను నడుపుతాను. . .నీవు జస్ట్ నేను చెప్పినట్లు చేయి చాలు. సావంత్ మోహన చెప్పిన ప్లాన్ ను విని సావంత్ నోరు తెరచుకొని ఉండిపోయాడు.అదే సమయంలో తన ప్లాన్ బెడిసికొడితే ముందు ముందు కు ఏం జరుగుతుందో నని భయపడ్డాడు.

మోహన సావంత్ కు ధైర్యం చెబుతూ చూడు సావంత్ నీవు చెప్పిన దాన్ని బట్టి. . .అన్ని విశయాలనూ పక్కా చేసుకొన్న తరువాతే మన ప్లాన్ అమలు చేద్దాం. . .ఒకటి రెండు రోజుల వరకూ ఆంటీని అవాయిడ్ చేయ్. . .మీ స్నేహానికీ . . .నీ భవష్యత్తుకు ఏమాత్రం ఢోకా రాకుండా నేను చూసుకొంటాను. ఆ మాత్రం నన్ను నమ్ము. . .ఏ రకంగానైనా నీకే లాభం కదా. . .అంది చివరగా. . .

సావంత్ లోలోపల లొట్టలేసుకొంటూ పైకి మాత్రం మేక పోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ సెలవు తీసుకొన్నాడు.

సావంత్ వెళ్ళిన వైపే చూస్తూ సాలోచనగా తల పంకించింది.

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000